అల్యూమినియం పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెం సమీపంలోని సీఎంఆర్ ఏకో అల్యూమినియం పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పరిశ్రమలో సగానికి పైగా భాగం దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారికి సమీపంలో పరిశ్రమ ఉండటంతో, అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

సంబంధిత పోస్ట్