హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతి విధ్వంసం కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిర్మౌర్ జిల్లాలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 200 మీటర్ల మేర కొండ భాగం కూలిపోయింది. ఈ దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.