భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులాం సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 11న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో వారణాసిలో భేటీ అయ్యారు. భారత్ మారిషస్‌కు రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా, 7 కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఆయన పర్యటన సెప్టెంబర్ 16తో ముగుస్తుంది.