మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం జక్కన్నపేట గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్‌స్టేషన్‌లో 75 హెచ్‌పీ మోటార్లు రెండు కాలిపోవడం వల్ల గత వారం రోజులుగా 35 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. పనిచేయని మోటార్లను వెంటనే రిపేరు చేసి, నీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.