తపస్ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల

తపస్ చేగుంట శాఖ ఆధ్వర్యంలో తపస్ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి ఆదివారం పూలమాల వేశారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో భగత్ సింగ్ కీలక పాత్ర వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండల అధ్యక్షులు వెంకటేష్, స్వామి, చేగుంట మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, నందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్