ఘనపూర్ మండల కేంద్రంలో సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందకరం: ఎమ్మెల్యే

హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో శనివారం నూతనంగా నిర్మించిన అధునాతన సాంకేతిక కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందకరమని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్