అక్కన్నపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలపై శనివారం పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు వినతిపత్రం సమర్పించారు. సుమారు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. వెంటనే మూత్రశాలలు నిర్మించి, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.