శనివారం వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము సంచారం కలకలం రేపింది. ఆస్పత్రి భవనంలోకి ప్రవేశించిన పామును సిబ్బంది వెంటనే అప్రమత్తమై, పాములు పట్టేవారికి సమాచారం అందించారు. మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి డాక్టర్ గదిలోకి వెళ్లిన పామును పట్టుకోవడంతో సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి చుట్టూ చెట్లు, పొదలు ఎక్కువగా పెరగడం వల్ల పాములు తరచుగా సంచరిస్తున్నాయని తెలిపారు.