నార్సింగిలో వీధి కుక్కల దాడి.. యువకుడికి తీవ్ర గాయలు

నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నంద కిషోర్ అనే యువకుడు వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. తన స్నేహితుడి ఇంటి నుంచి నోట్‌బుక్స్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా, ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఓ వీధి కుక్క అతడిపై దాడి చేసి చేతిపై గాయపరిచింది. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్