ఇటీవల మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదల్లో కొట్టుకుపోయిన హవేలి ఘనపూర్ మండలానికి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే రోహిత్ రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సాయం శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.