ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ, మనం సంపాదించే ఆదాయంలో కనీసం 40 శాతం పొదుపు చేయాలని సూచించారు. పొదుపు అంటే కేవలం డబ్బు దాచుకోవడమే కాదని, భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత కల్పించడం కూడా అని ఆయన అన్నారు. ప్రతీ వ్యక్తి తన ఆదాయంలో ఒక భాగాన్ని క్రమంగా పొదుపు చేస్తే జీవితం మరింత స్థిరంగా ఉంటుందని జీవన్ కుమార్ తెలిపారు.