పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆమె స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, దుండగులు ఆమెను సమీప అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.