హీరోయిన్ మీనాక్షి చౌదరి, అక్కినేని హీరో సుశాంత్ డేటింగ్ రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రేమ వార్తలను ఖండించినా, ఈ తాజా వీడియోతో గాసిప్స్ మరింత వేడెక్కాయి. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారిందని అప్పట్నుంచే వార్తలు వస్తున్నాయి.