కేరళలో గురువారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మంత్రి శశీంద్రన్ మేనకోడలు శ్రీలేఖ (67), ఆమె భర్త ప్రేమరాజన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కన్నూర్‌లోని చిరక్కల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి వారికి కాల్ చేసినప్పుడు స్పందించకపోవడంతో డోర్ తెరిచి చూడగా.. బెడ్‌రూమ్‌లో దంపతులు నిర్జీవంగా పడి ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాలను కాల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.