ఎమ్మెల్యే కాల్ రికార్డు వైరల్ (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన ఘటనపై చేవెళ్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారు చేవెళ్ల నియోజకవర్గానికి చెందినవారు కాదని, అందుకే తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లుగా ఒక టీచర్ తో ఫోన్ సంభాషణలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు మాట్లాడారని, తాను ఎందుకు స్పందించాలని ఆయన ప్రశ్నించారు. ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్