AP: ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడని, అందుకే జగన్ను, ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందని వైఎస్ షర్మిల అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సీబీఐ మోదీ చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయిందని మండిపడ్డారు. నిజంగా సీబీఐ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈపాటికే దోషులకు శిక్ష పడేదన్నారు.