భారత్–జపాన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం టోక్యో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా దంపతులకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఇషిబాకు చంద్రుని రాయి, మక్రానా పాలరాయితో తయారైన రామెన్ గిన్నె–చాప్‌స్టిక్‌ల సెట్‌ను, ఆయన భార్యకు లడఖ్ పాష్మినా మేక ఉన్నితో నేసిన పాష్మినా శాలువాను అందజేశారు. ఇవి భారతీయ కళ, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.