ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ట్రంప్ ప్రతిపాదించిన మొదటి దశ శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఎక్స్‌లో స్పందించిన ఆయన, ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సహాయం, శాశ్వత శాంతికి దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.