బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏం చేయడానికైనా వెనకాడరని ఆరోపించారు. ఎన్నికల తర్వాత బిహార్ సమస్యలను పట్టించుకోరని విమర్శించారు. నిరుద్యోగంపై మోదీ మౌనంగా ఉండి, యువతను రీల్స్ వైపు మళ్లిస్తున్నారని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, బిహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.