నకిలీ కరెన్సీ కేసులో పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకి చెన్నై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2018లో వెలుగులోకి వచ్చిన నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్ల చలామణీ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. సిద్దిఖీపై ఎన్‌ఐఏ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసి, వాంటెడ్ లిస్టులో చేర్చింది.