పెట్రోల్‌ బంకులో డబ్బులు మాయం.. 29 మందిపై కేసు

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో రూ.65 లక్షల స్కాం బయటపడింది. డిసెంబర్‌ 7న ప్రారంభమైన ఈ బంక్‌లో సిబ్బంది సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని నిధులను గోల్‌మాల్ చేసినట్లు రాయచోటి డీపీటీఓ రాము విచారణలో తేలింది. డిపో మేనేజర్ ఫిర్యాదుతో ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాల మేరకు పట్టణ సీఐ నాగార్జున 29 మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్