హుస్సేన్ సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

TG: కుటుంబ కలహాలతో వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పాతబస్తీలో నివాసముంటున్న పృథ్విలాల్, కీర్తిక అగర్వాల్(28) దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. ఏడాదిన్నరగా భర్తతో గొడవల వల్ల కీర్తీక తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2న హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్