హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కుందన్‌బాగ్ ఉమానగర్‌కు చెందిన వల్లెపు గంగులమ్మ (50) తన కుమారుడు హర్షవర్థన్ (27)ను మరొకరి సాయంతో హత్య చేసింది. మద్యానికి బానిసైన హర్షవర్థన్ వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.