ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి పిల్లల తల్లి తన భర్తను వదిలి.. మేనల్లుడిని వివాహం చేసుకుంది. అయితే భర్తే దగ్గర ఉండి పెళ్లి చేయడం గమనార్హం. సదరు మహిళ గత కొంతకాలంగా మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలాసార్లు భర్త మందలించినా మహిళలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భర్త.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ హనుమాన్ ఆలయంలో భార్యకు వివాహం జరిపించాడు.