అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఎంపీ సంజయ్ రౌత్

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తన మద్దతుదారులకు తెలియజేశారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో చికిత్స పొందారు.

సంబంధిత పోస్ట్