నటి, నిర్మాత నిహారిక కొత్తగా ‘కమిటీ కుర్రాళ్లు’ విజయంతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సంగీత్ శోభన్‌తో రెండో సినిమా తెరకెక్కిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకుంటూ.. “నా రెండు ప్రపంచాలు కలిశాయి. కెమెరా ముందు నటించాను, పక్కనే నిర్మాతగా నా ఆఫీస్‌లో పనులు చూసుకున్నాను. యాక్టింగ్ నా ప్యాషన్, ప్రొడక్షన్ నా అభివృద్ధి” అని రాసుకొచ్చింది. ఓ వీడియోను కూడా షేర్ చేశారు.