ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్ మహ్మద్ నబీ 60 (22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) చివర్లో విరుచుకుపడ్డాడు. 19 ఓవర్‌లో వరుసగా 3 ఫోర్లు బాదిన నబీ.. 20వ ఓవర్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాదేశాడు. దీంతో శ్రీలంక లక్ష్యం 170 పరుగులుగా ఉంది.
Credits: Sony Sports Network