కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ లో చోరీ ఘటన సంచలనం రేపింది. వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో ఈరోజు ఉదయం ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. గృహప్రవేశం చేసిన రోజు రాత్రే దొంగ కిటికీ తెరిచి ఉండటంతో చేతులు పెట్టి తలుపు గడియ తీశాడు. లోపలికి ప్రవేశించి దేవుని పటాల వద్ద ఉన్న బంగారు గొలుసుతో పాటు, ఓ మహిళ మెడలోని 3.5 తులాల గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.