కల్వకుర్తి: డ్రంక్&డ్రైవ్ కేసు.. ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి న్యాయస్థానం మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. శుక్రవారం ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన కాజా మైనుద్దీన్ ఖాన్ కు రెండు రోజులు జైలు, రూ. 600 జరిమానా, రాచూర్ గ్రామానికి చెందిన కాటిక యాదయ్యకు ఒక రోజు జైలు, రూ. 600 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్