నాగర్ కర్నూల్: హెచ్చరిక.. ఆదమరిస్తే అంతే సంగతులు

నాగర్ కర్నూల్ నుంచి బిజినేపల్లి మార్గంలో పాలెం వద్ద పడిన గుంతలు వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. రాత్రి వేళల్లో ఈ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నప్పటికీ, అధికారులు ఇప్పటికీ గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రహదారులు మరింత దెబ్బతిని ఇబ్బందులు పెరిగాయి. వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్