మహిళలు ఎక్కువగా ఇష్టపడే నెయిల్ పాలిష్‌లో ఫార్మాల్డిహైడ్, టోలుయెన్, డైబ్యూటిల్ థాలేట్ వంటి క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిని పదేపదే ఉపయోగించడం, నెయిల్ పాలిష్ రిమూవర్‌తో తొలగించడం వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, DNAలో మార్పులు వస్తాయని నిపుణులు కనుగొన్నారు. రోజువారీ నెయిల్ పాలిష్‌ను నివారించాలని, గర్భవతులు, పిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారు, క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.