సివిల్ పంచాయతీలో తలదూర్చిన చిట్యాల పోలీసులు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి హనుమాన్ గుడిలో పని చేసే పూజారి రూ.1 లక్ష ఇచ్చాడు. దానిని సమయానికి ఆ వ్యక్తి చెల్లించనందుకు పూజారి తనకున్న రాజకీయ పలుకుబడితో చిట్యాల పోలీసుల నుంచి సదరు వ్యక్తి పై ఒత్తిడి చేస్తున్నారు. అప్పు చెల్లించాలంటూ కానిస్టేబుల్స్ సదరు వ్యక్తితో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. సివిల్ పంచాయతీలో తలదూర్చవద్దని తెలిసినా పోలీసులు ఇన్ వాల్వ్ కావడంతో సదరు పోలీసుల పై చర్యలు తీసుకోవాలని బాధితుడు జిల్లా ఎస్పీని కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్