భగత్ సింగ్, గుర్రం జాషువా జయంతి వేడుకలు

దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 132వ భగత్ సింగ్, 130వ గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, గుర్రం జాషువా రచనలు దళిత, బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. వీరిని ఆదర్శంగా తీసుకొని యువత ప్రభుత్వాల నుంచి తమ హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, రచయితలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్