చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

ఈ ఖరీఫ్ లో రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం మిర్యాలగూడలోని రామకృష్ణ రైస్ మిల్లును తనిఖీ చేసిన ఆమె, రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని సూచించారు. మిల్లింగ్ కెపాసిటీ, బాయిల్డ్ రైస్ ప్రక్రియ వంటి అంశాలపై మిల్లు యజమానితో చర్చించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు లక్ష 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 290 కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్