వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

అధిక వర్షాల కారణంగా చెరువులన్నీ నిండుకుండలా మారాయని, పడ్డ ప్రతి చినుకు వరద రూపంలో కిందికి వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఊర చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా వరద నీటిని మళ్ళించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్