నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో, 12 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,19,324 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,27,624 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 589.8 అడుగులకు చేరుకుంది, ఇది పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరువలో ఉంది.