కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలోని శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. చల్లని సాయంకాల సమయంలో మహిళలు ఉసిరి దీపాలు, 365 వత్తులతో స్వామివారికి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.