ఎమ్మెల్యే సొంత నిధులతో తాత్కాలిక బ్రిడ్జి మరమ్మతులు పూర్తి

నల్లగొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామంలో భారీ వర్షాల కారణంగా అలుగు బ్రిడ్జికి గండి పడింది. దీనితో దాదాపు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తన సొంత నిధులతో తాత్కాలికంగా బ్రిడ్జిని మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కాంసాని చంద్రశేఖర్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్