రజక వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో రజక వృత్తిదారులపై నిత్యం జరుగుతున్న సామాజిక దాడులను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, దీనివల్లే దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.