నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, ఐఎంఏ నకిరేకల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు రఘునందన్ మాట్లాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడా నివారించవచ్చని తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో డాక్టర్ రాపోలు ఫౌండేషన్, నల్లగొండ ఓబిజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో మహిళలు, పురుషులకు హెచ్ బి, ఆర్ బి ఎస్, బిఎండి, టీ 3, టి4, టిఎస్ హెచ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.