యాదాద్రి భువనగిరి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫానుతో నష్టపోయిన పత్తి పంటను పరిశీలించిన అనంతరం, 20 శాతం తేమ ఉన్నా షరతులు లేకుండా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు వర్షాలు నష్టాన్ని కలిగించాయని ఆయన పేర్కొన్నారు.