బుధవారం సాయంత్రం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద రసాయనాలతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ ట్యాంకర్, టోల్‌ప్లాజా దాటిన వెంటనే రోడ్డుపై బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి రసాయనాలు రోడ్డుపై పడి నురగలు కమ్ముకొని, తెల్లని పొగతో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.