నల్గొండ: ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా, శనివారం శాసనసభ ప్రాంగణంలోని లాంజ్ లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్