ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలని రైతులు నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఏప్రిల్లో యాసంగి ధాన్యానికి క్వింటాకు రూ. 2400 ధర నిర్ణయించినా, రూ. 500 బోనస్ ఆశతో ఐకేపీ సెంటర్లలో విక్రయించడంతో క్వింటాకు 10కేజీల తరుగు, రూ. 400 వరకు నష్టపోయామని ఓ కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ విడుదల చేసేందుకు కృషి చేయాలని రైతులు కోరారు.