ఇటీవల కురిసిన మొంతా తుఫాన్ కారణంగా నల్లగొండ జిల్లాతో సహా అనేక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పండిన వరి పంటలు నీట మునిగి, మొలకెత్తి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం అనంతారం గ్రామంలో నష్టపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి ఎకరాకు ₹30,000 పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.