అధికారం కోసం హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికి వదిలేసారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ను ఆదివారం మాజీ మంత్రి తిప్పర్తి మండల కేంద్రంలో ప్రతి ఇంటికి అందజేశారు. వీరితోపాటు నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.