పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలన

నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు. ఎస్పీ ప్రతి ఒక్కరి సమస్యను విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్