తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే భవన ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా, శాసన మండలి చైర్మన్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, ఆర్&బి, అగాఖాన్ సంస్థ అధికారులతో కలిసి జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.