కార్తీక పౌర్ణమి సందర్భంగా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. అయితే, భక్తుల నుంచి ఆలయ సిబ్బంది అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని, కనీస వసతులు కూడా కల్పించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై దేవస్థాన అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.