కార్తీక పౌర్ణమి సందర్భంగా పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. కార్తీకమాసంలో 365 వొత్తులను వెలిగిస్తే సంవత్సరంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.